అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి ప్రాజెక్ట్ కు గండిపడి వరి, పత్తి, ఇతర పంటలు కోల్పోయిన రైతులకు, గృహాలు పాక్షికంగా లేక పూర్తి గా నష్టపోయిన నిర్వాసితులకు, పశువులు, జీవాలు మృత్యువాత పడిన యజమానులకు స్థానిక అధికారుల నివేదిక ఇచ్చిన వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం గుమ్మడివల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.