ఉచ్చులో చిక్కుకొని గేదెలు మృతి

56చూసినవారు
ఉచ్చులో చిక్కుకొని గేదెలు మృతి
అటవీ జంతువుల కోసం అమర్చిన ఉచ్చులో చిక్కుకొని ఆరు గేదెలు మృతి చెందిన ఘటన వాజేడు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండపాక అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అటవీ జంతువుల కోసం ఉచ్చులు అమర్చారు. అటువైపుగా మేత కోసం వెళ్లిన గేదెలు ఆ ఉచ్చుల్లో చిక్కుకుని మృతి చెందాయి. గేదెల విలువ రూ. 5లక్షలకు పైగా
ఉంటుందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్