ఈనెల 9 నుంచి నిత్యకల్యాణాలు నిలిపివేత

1542చూసినవారు
ఈనెల 9 నుంచి నిత్యకల్యాణాలు నిలిపివేత
భద్రాచలం రామాలయంలో ఈనెల 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఈఓ రమాదేవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9 నుంచి నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 24 నుంచి తిరిగి నిత్యకల్యాణాలు ఉంటాయన్నారు. 9న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్