Oct 04, 2024, 09:10 IST/
మహారాష్ట్రలో సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే (వీడియో)
Oct 04, 2024, 09:10 IST
మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ శుక్రవారం సచివాలయ భవనంలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. అయితే, అప్పటికే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన వలలో పడడంతో.. ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ధనగర్ కమ్యూనిటీ డిమాండ్ చేస్తున్న ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.