ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా బుధవారం కొత్తగూడెంలోని బాబు క్యాంప్ లో ఉన్న భవిత సెంటర్ లో మూగ, చెవిటి పిల్లలకు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి పాల్గోని మాట్లాడుతూ.. దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదని, ఆత్మ నున్యత భావాన్ని పక్కనపెట్టి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు.