జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు, గౌరవ వేతనం ప్రాతిపాదికన 9 ప్రొఫెసర్, 35 అసోసియేట్ ప్రొఫెసర్, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్, 17 ట్యూటర్, 52 సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామకానికి ఈ నెల 18న కలెక్టరేట్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 నుంచి మ. 3 గంటల వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయన్నారు.