కొత్తగూడెం- పాల్వంచ జంట మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ అంశం చర్చకు రాగా అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల చిరకాల స్వప్నం నేరవేరనుందని ఆయన అన్నారు.