క్రమబద్ధీకరణ చేయకపోతే జనవరి 30న లక్ష మందితో మీటింగ్ పెడతామని, అప్పటికీ చేయకపోతే 30 రోజుల్లో ముఖ్యమంత్రినే మార్చేద్దాం అంటూ తనదైనశైలిలో కె. ఎ. పాల్ మాట్లాడారు. మణుగూరు మండలం పగిడేరులో చేపట్టే సేవా కార్యక్రమాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన కొత్తగూడెం మీదుగా వెళ్లే క్రమంలో గురువారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్ష వద్ద శిబిరంలో కూర్చుని మాట్లాడారు.