ప్రభుత్వాలు మహిళా కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని ఐఎస్టియు జిల్లా కోశాధికారి మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం రైటర్ బస్తీలో మహిళ కార్మికులతో కలిసి ఐఎఫ్టియు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేరళలో రెండు నెలల క్రితం ఆసుపత్రిలో పారిశుద్ధ్య మహిళా కార్మికులపై జరిగిన హింసాత్మక ఘటనపై విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.