ప్రమాదవశాత్తు లారీ దగ్ధమైన ఘటన గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రహదారిపై చోటు చేసుకొంది. జూలూరుపాడులో కంకర అన్లోడ్ చేసిన ఓ లారీ పినపాక వైపు వెళ్తుంది. కారుకొండ గుట్టల సమీపంలో ఇంజన్లో మంటలు
చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ పెద్దిరాజు వాహనాన్ని నిలిపి కిందకు దిగాడు. అంతలోనే మంటలు వ్యాపించి లారీ దగ్ధమైంది.