ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణలో అమలు వేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణం లారీ ఓనర్ అసోసియేషన్ హాల్ జిల్లా సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనగా సమావేశ హాల్కు చేరుకున్నారు.