
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి
విభిన్న పాత్రలు పోషించిన విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు(83) అంత్యక్రియలు HYDలోని మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నేతల సమక్షంలో అంత్య క్రియలు జరిగాయి. వైవిధ్యభరితమైన పాత్రలతో సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. కోట భౌతిక కాయం మనకు దూరం అయినా.. ఆయన నటన అభిమానుల మనసులో నిలిచిపోతుంది.