లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

82చూసినవారు
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని, సొంత ఏజెండాతో పని చేస్తే ఇంటికి పంపిస్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం జూలూరుపాడులోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను ప్రభావంతో నష్టపోయిన ఇళ్ళు, పంటలు, రహదారులను పరిశీలించి నివేదికను అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్