మోరంపల్లిబంజర సంతలో మాజీ ఎమ్మెల్యే తాటి

82చూసినవారు
మోరంపల్లిబంజర సంతలో మాజీ ఎమ్మెల్యే తాటి
బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామంలో జరిగే వారాంతపు సంతలో శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూరగాయలు కొనుగోలు చేస్తూ సందడి చేశారు. బూర్గంపాడు, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా పని చేశారు. ఎస్టీ శాసనసభ కమిటీ చైర్మనుగా కూడా ఆయన పని చేశారు. ఈ క్రమంలో సామాన్య పౌరుని లాగా వచ్చి మోరంపల్లిబంజరలోని సంతలో కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసి అందరిని పలకరించారు.

సంబంధిత పోస్ట్