మ‌సీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థ‌న‌లు

582చూసినవారు
మ‌సీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థ‌న‌లు
పినపాక మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం నెల వంక కనిపించింది. పినపాక, జానంపేట, ఈ. బయ్యారం మసీదుల్లో ముస్లిం సోదరులు గురువారం నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో చిన్నారులు, యువకులు, వృద్ధులు వందాలాదిగా ఈద్గాలకు తరలివచ్చి ప్రత్యేక సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you