పూడిక తీత పనులకు శంకుస్థాపన
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఫిష్ మార్కెట్ వద్ద కట్టవాగు పూడిక తీత పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రారంభించారు. అనంతరం వరదలకు గురైన పలు కాలనీలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులు ఎవరూ కూడా బాధపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.