గార్ల గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం విజయవంతం చేసినందున గ్రామసభలో సన్మానం చేసి ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎం మంగమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి కిషన్ నాయక్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.