నాటుసారాతో పట్టుబడిన ఐదుగురుపై బైండోవర్

55చూసినవారు
నాటుసారాతో పట్టుబడిన ఐదుగురుపై బైండోవర్
టేకులపల్లి మండలానికి చెందిన వేరువేరు గ్రామాలలో నాటుసారాతో పట్టుబడిన ఐదుగురిని మంగళవారం బైండోవర్ చేసారు. తహసిల్దార్ నాగభవాని, ఎక్సైజ్ ఎస్ఐ అచ్చారావు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మనపల్లికి చెందిన ముగ్గురు, కొత్త తండాకు చెందిన ఒకరు పాత తండాకి చెందిన ఒకరు నాటుసారాతో పట్టుబడటంతో వారిపై తాసిల్దార్ నాగభవాని బైండోవర్ నమోదు చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అచ్చారావు, కానిస్టేబుల్ రవిబాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్