మోడల్ మార్కెట్లో పారదర్శకంగా గదుల కేటాయింపు ఉంటుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య వ్యాపారస్థులకు సూచించారు. ఇల్లందు పురపాలక కార్యాలయంలో కూరగాయల వ్యాపారస్థులతో చైర్మన్ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మోడల్ మార్కెట్ భవనంలోని కింది అంతస్తులో ఉన్న గదులను వ్యాపారస్థులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.