కొత్తగూడెం నుంచి ఇల్లందు మీదుగా మహబూబ్ నగర్ కు ఆరు పశువులతో తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎస్సై సూర్య ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా మహబూబ్ నగర్ కు చెందిన నేనావత్ శ్రీను, సురేందర్ వాహనంలో అక్రమంగా పశువులు తీసుకొస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.