టేకులపల్లి మండలం దాసుతండా నుంచి ఎర్రబోడు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ బీటీ రోడ్డు నిర్మాణ పనులను 2. 4 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.