నేతన్నలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ‌

58చూసినవారు
నేతన్నలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ‌
తెలంగాణలో నేత‌న్న‌ల‌పై కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష క‌ట్టింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నేతన్నలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప‌దేండ్ల‌లో తాము నేత‌న్న‌ల‌కు చేతి నిండా పని క‌ల్పించామన్నారు. ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు, ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చ‌రించారు.

సంబంధిత పోస్ట్