'ఎల్‌2: ఎంపురాన్‌' వివాదం.. వివాదాస్పద సీన్స్‌ కట్‌: నిర్మాత

55చూసినవారు
'ఎల్‌2: ఎంపురాన్‌' వివాదం.. వివాదాస్పద సీన్స్‌ కట్‌: నిర్మాత
మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఎల్‌2 : ఎంపురాన్‌' సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివాదానికి దారి తీసిన సన్నివేశాలను తొలగించమని డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు తెలిపినట్లు చిత్ర నిర్మాత గోకులం గోపాలన్‌ వెల్లడించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాల్లేవని ఆయన తెలిపారు.  ఇప్పటికే కొన్ని పదాలను మ్యూట్‌ చేశామని నిర్మాత పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్