మరో రెండు హామీల అమలుపై చంద్రబాబు ప్రకటన

70చూసినవారు
మరో రెండు హామీల అమలుపై చంద్రబాబు ప్రకటన
AP: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన హామీల్లో సూపర్ సిక్స్ ఒకటి. ఈ క్రమంలో చంద్రబాబు మరో రెండు హామీలపై కీలక ప్రకటన చేశారు. మే నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని ఇటీవల ప్రకటించారు. తాజాగా పీ4, మార్గదర్శి-బంగారు కుటుంబం పథకాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్