ఛత్తీశ్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో దాదాపు 16 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత జగదీష్ కూడా మరణించారు. జీరామ్ ఊచకోత కేసులో జగదీష్ కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో పోలీసులు ఆయనపై గతంలో రూ. 25లక్షల రివార్డు కూడా ప్రకటించారు.