ఊయల నుంచి జారిపడి విద్యార్థి మృతి

58చూసినవారు
ఊయల నుంచి జారిపడి విద్యార్థి మృతి
AP: విజయనగరం జిల్లా సీతంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో ఊయల నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందాడు. కె.కాగుమానుగూడకు చెందిన విద్యార్థి సవర చలపతి (14) 9వ తరగతి చదువుతున్నాడు. స్కూలులో ఊయల ఊగుతుండగా.. కాలుజారి కిందపడ్డాడు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా అంటూ తల్లి లండమ్మ గుండెలవిసేలా రోదించారు.

సంబంధిత పోస్ట్