వేడెక్కిన ఏపీ.. ఆ ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

74చూసినవారు
వేడెక్కిన ఏపీ.. ఆ ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ఏపీలో తీవ్ర వడగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ, అనంతపురం, తూర్పుగోదావరి, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఏపిలో చాలా చోట్ల వడగాల్పుల కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్