యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఇటీవల లేడీ గెటప్‌లో నటించిన మూవీ లైలా. ఫిబ్రవరిలో ప్రేమికుల రోజున విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆహాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. మార్చి 7 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది.