పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ జిల్లాలోని ఖయర్తాలా ప్రాంతంలో నాటుబాంబులు పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మామున్ మొల్లా అనే వ్యక్తి తన ఇంట్లో నాటుబాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మామున్ మొల్లా, సకీరుల్ సర్కార్, ముస్తాకిన్ షేక్ మరణించారని, పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయిందని పేర్కొన్నారు.