జమ్మూ ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా

74చూసినవారు
జమ్మూ ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా
జమ్మూలోని రియాసిలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వుందని తేలింది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది. దాదాపు 12 మంది ఉగ్రవాదులు రెండు మూడు గ్రూపులుగా విడిపోయి రాజౌరి-పూంచ్ అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారు. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు.

సంబంధిత పోస్ట్