ఆటోమొబైల్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BMW మోటరాడ్ భారత మార్కెట్‌లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ BMW CE 02ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. BMW CE 04 కంటే చౌక. BMW మోటరాడ్ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. సింగిల్ చార్జింగ్ పూర్తి చేస్తే గరిష్టంగా గంటకు 95 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.