గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతం సమీపంలోని మార్గంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. మట్టి రోడ్డులో రెండు సింహాలు అక్కడ ఉండటం చూసి కొంతదూరంలో వారు ఆగిపోయారు. బైక్ నడిపే వ్యక్తి అక్కడ ఉండటాన్ని సింహాలు గమనించాయి. మెల్లగా నడిచి అతడి వద్దకు వెళ్లాయి. భయపడిన ఆ వ్యక్తి కూడా బైక్ దిగి పక్కనున్న పొదల్లోకి వెళ్లాడు.