జూన్ 4 తర్వాత ప్రధాని మోదీకి లాంగ్ లీవ్: జైరాం రమేష్

74చూసినవారు
జూన్ 4 తర్వాత ప్రధాని మోదీకి లాంగ్ లీవ్: జైరాం రమేష్
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత జైరాం రమేష్ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్’’ భావజాలం ఉందని ప్రధాని ఆరోపించిన తరుణంలో ఆయన వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. ప్రధాని అబద్ధాలతో ఇప్పుడు దేశ ప్రజలు విసిగిపోయారని, జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్‌కి వెళ్లాల్సి వస్తుందని, ఇది భారత ప్రజల హామీ అని అన్నారు. కాంగ్రెస్ హామీలు ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్