చలికాలంలో జలుబు, గొంతునొప్పి, కండరాలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి. అయితే ఏ రోగాలైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే దాడిచేస్తుంటాయి. అందుకే సీజనల్ వ్యాధులతో పోరాడాలంటే తగిన ఇమ్యూనిటీ పవర్ అవసరం. 'బొప్పాయి'ని తినడంతో అది పుష్కలంగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. డెంగ్యూ పేషెంట్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను, యాసిడ్ రిఫ్లెక్స్ ను నివారిస్తుంది.