1970ల్లోనే సాన్యో కంపెనీ డిజైన్ చేసిన హ్యూమన్ వాషింగ్ మెషీన్ స్ఫూర్తితో జపాన్‌కు చెందని సైన్స్ కో కంపెనీ దీన్ని డిజైన్ చేసింది. కేవలం స్నానం మాత్రమే కాకుండా ఓ స్పాలో ఉన్న అనుభూతి కలిగేలా ఈ వాషింగ్ మెషీన్‌లో పలు ఏర్పాట్లు చేశారు. ఇది ఏఐ సాంకేతికత సాయంతో పనిచేస్తుంది. దీంతో, స్నానం చేసే వారి భావోద్వేగ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మెషీన్‌లోని వాతవరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.