భారత బాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని పీవీ సింధును ఢిల్లీలో కలిసి తన వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు తన పెళ్లి పత్రికను ఆమె అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వీపీ సింధుకి కంగ్రాట్స్ చెప్పారు.