మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీ

77చూసినవారు
మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీ
నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యాశాఖలో మండల విద్యాశాఖ అధికారుల ఖాళీలు భారీగా ఉన్నాయి. జిల్లాలో 20 మండలాలు ఉండగా అన్ని మండలాల్లో రెగ్యులర్ మండల విద్యాశాఖ అధికారులు లేరు. ఉన్న మండల విద్యాశాఖ అధికారులకు ఒక్కొక్కరికి రెండు మూడు మండలాల బాధ్యతలు అప్పగించారు. దీంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. కీలకమైన పోస్టులను ఖాళీగా పెట్టడం పట్ల విద్యావేత్తలు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్