తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డ నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామానికి శనివారం చేరుకున్నారు. ప్రతి దసరా పండుగ రోజు తన సొంత ఊరిలో జరిగే వేడుకలకు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం తన సొంత ఊరికి హెలికాప్టర్లో వచ్చారు. బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.