గ్రామ స్థాయిలో విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు: డిప్యూటీ సీఎం పవన్
AP: గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. "కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం. అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ ఏర్పాటు చేస్తాం. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటాం." అని అన్నారు.