
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన ఘటన కలకలం రేపుతుంది. కొచ్చి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని నాగ్‌పుర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్ బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.