మన్యంకొండ నీటి శుద్ధి కేంద్రం నుండి నీటి సరఫరా అయ్యే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ ఏర్పడింది. ఈ మేరకు కొత్త పైపులను వేయుచున్న కారణంగా ఆదివారం సాయంత్రం 6: 00 గంటల నుండి సోమవారం సాయంత్రం 6: 00 గంటల వరకు దేవరకద్ర, నర్వ, మరికల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాలకు నీటి సరఫరా ఉండదని భగీరథ అధికారులు తెలిపారు.