గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి గాయపడిన ఘటన శనివారం దేవరకద్ర మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం. రైలు నుండి క్రింద పడడంతో తలకు బలమైన గాయం తగలడం వల్ల హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించడం జరిగిందని తెలిపారు. సుమారుగా వయస్సు 45 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. ఎవరైనా వ్యక్తిని గుర్తించినచో మహబూబ్ నగర్ రైల్వే ఎస్ఐ అక్బర్ సెల్ నెంబర్ 87126 58597 సంప్రదించగలరని తెలిపారు.