కొత్తకోటకు చెందిన జె. ప్రభాకర్ కు నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ వైద్యం కోసం, సీఎం సహాయనిధి రూ. 2, 50, 000 ఎల్ఓసిని మంగళవారం స్వయంగా వారి నివాసానికి వెళ్లి ఎల్ఓసిని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి అందజేశారు. అనంతరం పొన్నకల్ కు చెందిన వెల్టూర్ రాజేశ్వర్ రెడ్డికి నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ స్టోన్ కు ఆపరేషన్ కు రూ. 1, 00, 000, చౌదర్పల్లికి చెందిన ఆంజనేయులు గౌడ్ కు నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ అపరేషన్ కు రూ. 1, 75, 000 ఎల్ఓసిలను అందజేశారు.