మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భక్తులు సమర్పించిన కోడె దూడలను వేలం వేయనున్నారు. ఈ నెల 25న బహిరంగ వేలం వేస్తున్నట్లు సోమవారం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈఓ శ్రీనివాస రాజు తెలిపారు. ఉ. 11: 00 గంటలకు జరిగే ఈ వేలం పాటలో వ్యవసాయ ఆధారిత రైతులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. ఈ అవకాశాన్ని వ్యవసాయ రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.