ఖబడ్డార్ రేవంత్ రెడ్డి. హెచ్సీయూ భూములు వేలం వేయడం సరికాదు. ఆ భూములు ఎవరి జాగిరు కాదు' అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.