ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ లో మృతుడు మహబూబ్ నగర్ వాసి

56చూసినవారు
మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలోని సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకరకు చెందిన కఠికే సురేష్ గా గుర్తించారు. సురేశ్ చికెన్ సెంటర్ వ్యాపారి. బస్సులో ఫుట్ బోర్డు వద్ద నిలబడి ఉండగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి మృతి చెందాడు. యాదగిరిగుట్ట డిపో బస్సు రాయచూర్ నుంచి హైదరాబాద్ కి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.

సంబంధిత పోస్ట్