పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి సీఎం కావడం మన అదృష్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు పండుగ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్ పనులు మొత్తం పూర్తి చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు.