విద్యుత్తు షాక్ తో బాలుడు మృతి

66చూసినవారు
విద్యుత్తు షాక్ తో బాలుడు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన మానవపాడు లో మంగళవారం వీరేష్(7) అనే బాలుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
మనవపాడుకు చెందిన మద్దమ్మ, శ్రీనివాసులు కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పొలంలో ఎద్దులు పోట్లాడుతూ విద్యుత్ స్తంభాన్ని తగిలాయి. ఎల్ టి లైన్ విద్యుత్తు తీగ కిందపడింది. బాలుడు విద్యుత్తు తీగను తగలడంతో షాక్ కొట్టింది. గాయాల పాలైన బాలుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్