ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్‌లో రూ.300 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 2022 ఆగస్టులో జొమాటో రూ.4,477 కోట్లకు బ్లింకిట్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఇప్పటివరకు రూ.2,300 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.