జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను మహాశివరాత్రి సందర్భంగా బుధవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం వారికి శాలువా కప్పి, పూలమాలవేసి సత్కరించారు.